Site icon NTV Telugu

ఇక‌పై పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే… లేదంటే…

వాహ‌నం న‌డిపే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాలి. హెల్మెట్ లేకుంటే ప్ర‌భుత్వాలు భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు. అయితే, జ‌రిమానాల నుంచి త‌ప్పించుకోవ‌డానికి చాలా మంది హాఫ్ హెల్మెట్‌ను ధ‌రిస్తున్నారు. ఇలా హాఫ్ హెల్మెట్‌ను ధ‌రించ‌డం వ‌ల‌న ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని, ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో హాఫ్ హెల్మెట్ కార‌ణంగా ముఖానికి దెబ్బ‌త‌గిలే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో హెల్మెట్‌పై బెంగ‌ళూరు అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బెంగ‌ళూరు న‌గ‌రంలో 15 రోజుల‌పాటు హెల్మెట్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తామ‌ని, 15 రోజుల త‌రువాత హాఫ్ హెల్మెట్‌ను బ్యాన్ చేస్తామ‌ని, ఆ త‌రువాత జ‌రిమానాలు విధిస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. బెంగ‌ళూరు న‌గ‌రంలో ఇక‌పై త‌ప్ప‌నిస‌రిగా పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందేన‌ని అధికారులు చెబుతున్నారు.

Read: ఆకాశంలో ఎగిరే కార్లు వ‌చ్చేశాయి… ధ‌ర ఎంతో తెలుసా?

Exit mobile version