People looted 500 liters of diesel from the tanker in uttar pradesh: ఫ్రీగా వస్తే దేన్ని కూడా విడిచిపెట్టే కాలం కాదు ఇది. అలాంటిది డిజిల్ ఫ్రీగా దొరుకుతుందంటే ఇక ప్రజలు ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజిల్ ట్యాంకర్ కు ఓ వైపు ప్రమాదం జరిగితే.. ఎలాంటి భయం లేకుండా జనాలు బకెట్లతో ఎగబడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కాన్పూర్ కు సమీపంలో గుజాయినీ హైవేపై డిజిల్ ట్యాంకర్, ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి డిజిల్ లీక్ అవడం ప్రారంభం అయింది. సోమవారం సాయంత్రం సుమారు 20 వేల లీటర్ల డిజిల్ తో ట్యాంకర్ గుజాయినీ ప్రాంతం మీదుగా ఫతేపూర్ వెళ్తోంది. ఈ సమయంలో ప్రమాదం జరిగింది.
కాన్పూర్ లోని గోవింద్ నగర్ ప్రాంతంలో ట్యాంకర్ నుంచి డిజిల్ లీక్ కావడాన్ని గుర్తించి స్థానిక ప్రజలు డిజిల్ తీసుకెళ్లేందుకు బకెట్లతో ఎగబడ్డారు. దాదాపుగా 500 లీటర్ల డిజిల్ ను దొంగిలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇలా ప్రజలు డిజిల్ తీసుకెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. రోడ్డుపై డిజిల్ ప్రవహిస్తుండటంతో ప్రజలు ట్యాంకర్ వద్దకు బకెట్లతో పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది.
Read Also: Kishan Reddy : టీఅర్ఎస్ తొండి ఆట ఆడుతోంది.. మంత్రులు ఏకంగా ప్రజలకు లిక్కర్, చికెన్ వడ్డిస్తున్నారు
ప్రజలు తండోపతండాలుగా వస్తుండటం చూసి ట్యాంకర్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సమయానికే దాదాపుగా 500 లీటర్ల డిజిల్ చోరికి గురయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకు నుంచి లీకవుతున్న డీజిల్ ను డ్రమ్ముల్లో నింపారు. అనంతరం రెండో ట్యాంకర్‌లోకి డీజిల్ ని మార్చారు.
ఈ ట్యాంకర్ హిందూస్థాన్ పెట్రోలియం సంస్థకు చెందినదని ఫతేపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గోవింద్ నగర్ ఏసీసీ వికాస్ పాండే వెల్లడించారు. ట్యాంకర్ డ్రైవర్ ఉదయ్ భన్ సింగ్ మాట్లాడుతూ.. ట్రక్కు ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్స్ వేయడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ట్యాంకర్ మరో ట్రక్కును ఢీకొట్టొందని, ట్యాంకర్ షీట్ పగిలిపోయి దాని నుంచి డిజిల్ కారిపోయిందని తెలిపారు.
कानपुर के हाईवे पर हादसे के बाद फट गया पेट्रोल टैंकर, लोग पेट्रोल को बाल्टियों में भरकर ले जाते दिखे, पुलिस देखती रह गई|
यह मामला गोविंदनगर थाने के गुजैनी हाईवे का है| pic.twitter.com/fljtXEA5tS— Priya singh (@priyarajputlive) October 17, 2022
