Site icon NTV Telugu

Bihar Elections: షాకిస్తున్న ఓటర్ లిస్ట్‌! అందరూ వాళ్లే ఉన్నారు!

Biharvotetlist

Biharvotetlist

త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్రం ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్

ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు. ఇలా పరిశీలిస్తుండగా పెద్ద సంఖ్యలో మూడు దేశాలకు చెందిన వారే ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆగస్టు 1 నుంచి పౌరసత్వ స్థితిని అంచనా వేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ 30న ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేయనుంది. దీంతో అక్రమ వలసదారులను మినహాయించనుంది.

ఇది కూడా చదవండి: Kollywood : లోకేశ్ కనగరాజ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

అక్రమ విదేశీ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకే ఈ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరించడానికే ఈ డ్రైవ్ చేపట్టినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈసీ విధానంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ధృవీకరణ కోసం ఆధార్, ఓటరు ఐడీ, రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే పత్రాలుగా పరిగణించాలని పోల్ సంస్థను ధర్మాసనం ఆదేశించింది.

అయితే ఓటర్ల జాబితాలో అర్హత కలిగిన భారతీయ పౌరులను చేర్చడమే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకే ఈసీ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను చేపట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం ఎన్నికల సంఘం చేపట్టింది. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతోంది.

అక్టోబర్ లేదా డిసెంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఇందుకోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తి కాగానే.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version