Site icon NTV Telugu

Maritius Flight: రన్‌వేపైనే నిలిచిన విమానం.. ఏసీలు ఆఫ్.. ఊపిరాడక చిన్నారులు..!

Maritius Flight

Maritius Flight

Maritius Flight: టేకాఫ్‌ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రన్‌వేపై విమానాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే దాదాపు ఐదు గంటల పాటు విమానం రన్ వేపైనే ఉండడంతో అందులోని చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక నరకం అనుభవించారు. విమానంతో ఏసీలు కూడా పనిచేయక పోవడంతో అంతా క్లోజ్ లో ఉండటం వల్ల లోపల గాలిలేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మారిషస్ వెళ్లేందుకు ఎయిర్ మారిషస్ విమానం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ ఎక్కి ఎవరి సీట్లల్లో వాళ్లు కూర్చున్నారు. అయితే ఎంతకీ విమానం కదలకపోవడంతో ప్రయాణికులు ఏం జరిగింది అని అడగగా సాంకేతిక లోపంతో విమానం ఆగిపోయిందని చెప్పారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Read also: Bullet Temple: బుల్లెట్ బండిని పూజించే గుడి.. ఎక్కడో తెలుసా?

సాంకేతిక లోపం సరే.. ఏసీలు ఆన్ చేయాలని కోరారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఏసీలు కూడా పనిచేయడం లేదని సమాధానం చెప్పడంతో ప్రయాణికులు షాక్ తిన్నారు. అయితే ప్రయాణికులు కిందికి దిగుతామని ప్రయాణికులు చెప్పిన విమాన సిబ్బంది.. దిగేందుకు అనుమతించకపోవడంతో దాదాపు 5 గంటల పాటు అక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో విమానంలోని ఎయిర్ కండీషనర్లు పనిచేయకపోవడం.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని దించి చికిత్స అందించారు. సాంకేతిక సమస్యతో ఆగిపోయిన విమానం బయల్దేరడానికి సిద్ధంగా లేనందున ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తామని ఎయిర్ మారిషస్ ప్రకటించినప్పటికీ, విమానాశ్రయ అధికారులు లేదా విమానయాన సంస్థ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయపోవడం గమనార్హం.
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

Exit mobile version