Site icon NTV Telugu

Pune: పూణె-బెంగళూరు హైవేపై వోల్వో బస్సు దగ్ధం.. ప్రాణభయంతో దూకేసిన ప్రయాణికులు

Pune

Pune

పూణె-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేడ్ శివపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Allahabad High Court: అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? క్లారిటీ ఇచ్చిన హైకోర్టు!

వోల్వో బస్సులో మంటలు చెలరేగగానే ప్రయాణికులంతా కిందకు దూకేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా..

Exit mobile version