NTV Telugu Site icon

Waqf Bill: వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం..

Waqf Bi;ll

Waqf Bi;ll

Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని కేంద్రం ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్‌సభ ముందు ఉంచారు. బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో భాగం కానీ అంశాలపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశామని, మాకు కాంగ్రెస్ లాంటి కమిటీలు లేవని, గతంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలు కేవలం స్టాంప్ వేయడానికి మాత్రమే పనికి వచ్చేవని, మేము తీసుకువచ్చిన కమిటీల్లో చర్చించామని అన్నారు. మార్పులకు అంగీకరించకుంటే కమిటీ ఏర్పాటు చేసింది ఎందుకని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.