Site icon NTV Telugu

Parliament Session: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ..

పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభం కావడం.. ముగియడం జరిగిపోయాయి.. తొలి విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగగా.. తొలి రోజున రాష్ట్రపతి ప్రసంగం.. ఆ తర్వాత ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించడం.. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక, ఈ నెల 14వ తేదీ నుంచి బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. అయితే, పార్లమెంట్‌ ఉభయసభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.. రాజ్యసభ ఉదయం జరగనుండగా.. లోక్‌సభ బిజినెస్‌ సాయంత్రం జరగబోతోంది.. కరోనా థర్డ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా.. ఉభయ సభలు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు.. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుండగా.. లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది.

Read Also: Foreign Tourist: ఇండియా చూద్దామని వచ్చా.. ఇలా జరుగుతుందనుకోలేదు..

Exit mobile version