Site icon NTV Telugu

Parliament Sessions : రేపటి నుంచి ‌రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

2nd Phase Parliament Budget Sessions 2022 Starts From Tomorrow.

30 రోజుల తర్వాత తిరిగి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత సమావేశాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగాయి. టైమింగ్స్‌‌ మార్పుతో 19 గంటలు ఎక్కువగా సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు సోనియా గాంధీ నివాసంలో “పార్లమెంట్ వ్యూహ వ్యవహారల కమిటీ” సమావేశం కానుంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవాహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, మల్లిఖార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్, చిదంబరం, గౌరవ్ గొగోయ్ లు సమావేశంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, “ఫ్లోర్ కోఆర్డినేషన్”, ఉభయ సభల్లో భావసారూప్యతగల పార్టీలతో సమన్వయం పై చర్చించనున్నారు.

Exit mobile version