NTV Telugu Site icon

Parliament Session: జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..

Parliament Monsoon Session

Parliament Monsoon Session

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూలై 22 నుంచి పార్లమెంట్ సమవేశాలు జరగనున్నట్లు సమచారం. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జూన్ 17 నాటికి వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర వాటాదారులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్సు సంప్రదింపులను పూర్తిచేయనుంది. ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించే అవకాశం ఉంది.

Read Also: Siddipet Schools: సర్కారు బడి ముందు నో అడ్మిషన్ బోర్డు.. కారణం ఇదీ..

ఇదిలా ఉంటే 18వ లోక్‌సభ తొలి సెషన్ జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు ఇటీవల ట్వీట్ చేశారు. మరో 8 రోజుల్లో పార్లమెంట్ ప్రత్యే క సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

ఫిబ్రవరి 1న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను మరియు దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎలా రూపాంతరం చెందిందో ఆమె తెలియజేశారు. ఫుల్ టైమ్ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.