Site icon NTV Telugu

Pakistan Woman Sends Rakhi For PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్ మహిళ.. మోదీతో 20 ఏళ్లకు పైగా అనుబంధం

Pakistani Sister

Pakistani Sister

Pakistan Woman Sends Rakhi For PM Modi: పాకిస్తాన్ మహిళ మరోసారి ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. కమర్ మోహ్సీన్ షేక్ ప్రధాని మోదీకి రాకీ పంపింది. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ విజయం సాధించాలని కోరుకుంది. ఈ సారి ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ సారి ప్రధాని మోదీ తనను ఢిల్లీ పిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కూడిన రేష్మీ రిబ్బన్ ను ఉపయోగించి స్వయంగా తానే రాఖీ తయారు చేసినట్లు మోహ్సీన్ షేక్ తెలిపారు. రాఖీతో పాటు మోహ్సీన్ ఓ లేఖ కూడా రాశారు.

ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్యంతో దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నానని.. 2024లో కూడా ఆయనే విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారని అందులో సందేహం లేదని మోహ్సీన్ షేక్ అభిప్రాయం వ్యక్త పరిచారు. ప్రధాన కావడానికి మోదీ అర్హుడని.. ఎందుకంటే అనతికి సామర్థ్యాలు ఉన్నాయని.. ప్రతీసారి అతను భారతదేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 11 రక్షాబంధన్ పండగ రాబోతోంది.

Read Also: Allu Arjun: బింబిసార చిత్రబృందంపై ప్రశంసల వర్షం

ప్రధాని మోదీకి పాకిస్తానీ సోదరి కమర్ మోహ్సీన్ షేక్.. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి. అయితే పెళ్లి తరువాత ఆమె ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్ లో నివాసం ఉంటోంది. ప్రధాని మోదీకి గత 20-25 ఏళ్ల నుంచి రాఖీ కడుతోంది. ప్రధాని మోదీ స్వయం సేవక్ సంఘ్ లో ఉన్నప్పటి నుంచే కమర్ మోహ్సీన్ షేక్ కు తెలుసు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఆమె తప్పకుండా ప్రధాని మోదీకి రాకీ కట్టడమే.. రాఖీ పంపడమో చేస్తోంది.

Exit mobile version