NTV Telugu Site icon

Pakistan : పాకిస్తాన్ లో భారీగా పెరిగిన కోడిగుడ్డు ధరలు..ఒక్కో గుడ్డు ధర అంతనా?

Eggs

Eggs

పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారాయి.. చాలా దయనీయంగా మారింది.. తినడానికి తిండి కూడా లేకుండా చాలా మంది ఆకలితో చనిపోతున్నారు.. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32​కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే అక్కడి జనాలు బేంబేలెత్తిపోతున్నారు..

పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల పై కూడా ధరలు పైపైకి చేరుతున్నాయి.. దాంతో అక్కడి జనాలు తిండి లేక ఆకలితో చనిపోతున్నారు.. పాక్ లో గుడ్డు ధరలను చూస్తే ఇటీవల భారీగా పెరిగాయి.. డజన్‌ గుడ్ల ధర ఏకంగా రూ.360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్‌ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక, 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్‌ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు.. ఈ లెక్కన చూస్తే ఒక్కో గుడ్డు రూ. 32 లకు చేరింది..

సోయాబీన్స్‌ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. మరోవైపు.. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్‌ పాకిస్థాన్‌ బిజినెస్‌ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.. యుఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్) విలువ క్షీణించడం, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా, అంతకుముందు కూడా పాకిస్తాన్‌లో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. ఇలా పెరుగుతూ పోతే ఇక అక్కడ జనాల మనుగడ అనేది కష్టంగా మారుతుంది..

Show comments