Pakistan: పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్ నారాయణ అనే పడవ గుజరాత్‌లోని జూనాగఢ్ జిల్లా వేరావల్ తీర ప్రాంతం నుంచి చేపల వేటకు బయలుదేరింది. ఇక, రాత్రి సమయంలో ఆ పడవ నో-ఫిషింగ్ జోన్‌లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ దానిని స్వాధీనం చేసుకుంది.
Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
ఇక, ఆ పడవలో ఎనిమిది మంది మత్స్యకారులు ఉండగా, వారందరినీ పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు గుజరాత్ రాష్ట్రం జూనాగఢ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఒరొ వ్యక్తి మాత్రం మహారాష్ట్రకు చెందినట్లుగా సమాచారం. కాగా, ఈ ఘటనతో కలిపి 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారులు మొత్తం 125 మంది గుజరాతీ మత్స్యకారులను భారత జలాల నుంచి తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
