Painkiller Meftal: రుతుక్రమంలో వచ్చే పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులకు సాధారణంగా వినియోగించే పెయిన్ కిల్లర్ మెఫ్టాల్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. మెఫ్టాల్ వల్ల వచ్చే ప్రతికూల చర్యలను పర్యవేక్షించాలని డాక్టర్లకు, రోగులకు సలహా ఇస్తూ ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్(ఐపీసీ) డ్రగ్ సేఫ్టీ హెచ్చరికలను జారీ చేసింది. మెఫెనామిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, డిస్మెనోరియా, తేలికపాటి నుండి మితమైన నొప్పి, మంట, జ్వరం, దంత నొప్పికి చికిత్సలో వినియోగిస్తున్నారు.
Read Also: India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్‌లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) డేటాబేస్‌లోని డ్రగ్ రియాక్షన్ వివరాలు, ప్రాథమిక అనాలిసిస్ ప్రకారం.. ఈ డ్రగ్ వల్ల ఇసినోఫిలియా అండ్ సిస్టమిక్ సింప్టమ్స్(DRESS) సిండ్రోమ్‌తో ఈ డ్రగ్ ప్రతికూల చర్యలు చూపిస్తుందని కమిషన్ హెచ్చరించింది. నవంబర్ 30న జారీ చేసిన సలహా ప్రకారం.. హెల్త్ కేర్ నిపుణులు, రోగులు, వినియోగదారులు ఈ డ్రగ్ వల్ల ఏర్పడే ప్రతీకూల చర్యలను పర్యవేక్షించాలని సూచించింది.
ఈ డ్రగ్ వల్ల ఏదైనా రియాక్షన్స్ ఉంటే ప్రజలు వెంటనే www.ipc.gov.in లేదా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ADR PvPI ద్వారా, PvPI హెల్ప్‌లైన్ నం. 1800-180-3024 ద్వారా వెల్లడించాలని సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఐపీసీ భారతదేశంలో తయారైన, విక్రయించబడే, వినియోగించబడే అన్ని ఔషధాలకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది.