Site icon NTV Telugu

Pak-India: ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు

Loc

Loc

జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్ దళాలు.. భారత్ పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నాయి. తాజా కాల్పుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఎల్ఓసీ దగ్గరకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Assam: “ఉగ్రదాడి ప్రభుత్వ కుట్ర”.. పాకిస్థాన్‌కు మద్దతు పలికిన ముస్లిం ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు!

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాక్ వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా పాక్ బోర్డర్‌ను నిలిపివేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకుంటున్న పరిణామాలతో పాక్ భయాందోళనకు గురవుతోంది. దీంతో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందుకు తగ్గట్టుగా భారత్‌ కూడా తిప్పికొట్టేందుకు సిద్ధపడుతంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan : ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది

మంగళవారం పహల్గామ్ ఉగ్ర దాడిలో దాదాపు 26 మంది చనిపోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇక మృతదేహాలను ఆయా ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఈ దాడిలో 5-6 ఉగ్రవాదులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ ముష్కరులకు స్థానికులు కూడా సపోర్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Indian Airlines: ‘‘పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత’’.. భారతీయ విమానాలపై అదనపు భారం..

Exit mobile version