Padma Awards: కేంద్రం ఆదివారం 2026 ఏడాదికి గానూ పద్మ అవార్డుల్ని ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ విభాగాలకు సంబంధించి 131 మందికి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాల నుండి అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐదుగురికి భారత్ రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జాబితాలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు లేదా విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ఈ గౌరవాలు దక్కాయి.
పద్మ విభూషణ్:
పద్మ విభూషన్ వచ్చిన వారిలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్(మరణానంతరం), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం), క్లాసికల్ వయోలిన్ విద్వాంసుడు ఎన్. రాజం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.టి. థామస్, ప్రముఖ రచయిత పి. నారాయణన్ ఉన్నారు.
పద్మ భూషణ్:
పద్మ భూషన్ జాబితాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోష్యారి, అడ్వటైజింగ్ వెటరన్ పియూష్ పాండే (మరణానంతరం), సామాజిక నాయకుడు వెల్లపల్లి నటేసన్, టెన్నిస్ ఐకాన్ విజయ్ అమృతరాజ్, వైద్యంలో కల్లిపట్టి రామస్వామి పళనిస్వామికి, ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ నోరి దత్రాత్రేయుడికి, సామాజిక సేవలో ఎస్కేఎం మైలనందన్, కళల్లో శతావధాని ఆర్ గణేష్‌కు ఇచ్చారు. వీరితో పాటు జార్ఖండ్ మాజీ సీఎం శిబు సొరెన్, వికే మల్హోత్రాలను పద్మ భూషన్‌తో సత్కరించారు.
పద్మ శ్రీ:
పద్మ శ్రీ వచ్చిన ప్రముఖుల్లో క్రికెటర్ రోహిత్ శర్మ, మహిళా హాకీ క్రీడాకారిణి సవితా పునియా, రెజ్లర్ హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లార్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈ కళా జాబితాలో నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, శాస్త్రీయ గాయని త్రిప్తి ముఖర్జీ, తరుణ్ భట్టాచార్య, పోఖిల లెక్తేపి, ఆర్ మాధవన్‌తో పాటు తెలుగు నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లను పద్మ శ్రీలతో కేంద్రం సత్కరించింది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరందరికి అవార్డులు ప్రదానం చేస్తారు.
For the year 2026, the President has approved conferment of 131 Padma Awards including two duo cases (in a duo case, the Award is counted as one) as per list below. The list comprises five Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. Nineteen of the awardees are… pic.twitter.com/8DDKIRpPTM
— ANI (@ANI) January 25, 2026
