Site icon NTV Telugu

Oxygen Kits: ఆ రాష్ట్రంలో అన్ని వాహనాల్లో ఆక్సిజన్ కిట్లు తప్పని సరి

Sikkim

Sikkim

Oxygen Kits To Be Mandatory In All Vehicles: సిక్కిం రాష్ట్రం అన్ని వాహనాల్లో ఆక్సిజన్ కిట్లను తప్పనిసరి చేసింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండల మధ్య ఉన్న సిక్కిం రాష్ట్రంలో ఇటీవల ఎత్తైన ప్రాంతాల్లో ప్రజలు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివి అనేక సంఘటనలు జరగడంతో రాష్ట్రంలో రిజిస్టర్ అయిన అన్ని వాహనాల్లో తప్పనిసరిగా ఆక్సిజన్ కిట్స్, సిలిండర్లు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సిక్కిం రవాణా కార్యదర్శి రాజ్ యాదవ్ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వ్యక్తిగత మరియు వాణిజ్య వాహనాలకు పోర్టబుల్ ఆక్సిజన్ కిట్లు లేదా డబ్బాలు తప్పనిసరి అని పేర్కొంది.

Read Also: Smriti Irani: రాహుల్ గాంధీ “ప్రేమ” వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఆగ్రహం..

సిక్కింలో అనేక ప్రముఖ పర్యాలటక కేంద్రాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా రాష్ట్రానికి ఉత్తరాన 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో లాచెన్, లాచుంగ్, గురడోంగ్మార్ లేక్, యుమ్తాంగ్ ఉన్నాయి. రాష్ట్రంలోని నాథు-లా, బాబా మందిర్ వచ్చే పర్యాటకులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆక్సిజన్ కిట్లను రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరిస్తుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు తరుచుగా వాహనాలలో ఆక్సిజన్ కిట్లు ఉన్నాయా..? లేవా..? అని నిర్థారించుకునేందుకు తనఖీలు నిర్వహించనున్నారు.

Exit mobile version