Akhilesh Ayodhya Visit: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అయోధ్యలోని రామమందిర దర్శనానికి వెళ్తుడటం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 12న ఆయన శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. అయితే, దీనిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు శతాబ్దాల పాటు ముస్లింలు ప్రార్థనలు చేసిన ప్రదేశానికి అఖిలేష్ వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు. మసీదులు, మదర్సాలు కూల్చివేసన ప్రాంతాలను సందర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తన కొత్త రాజకీయ కూటమి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 జనవరిలో ఆలయ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అఖిలేష్ అయోధ్య పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ‘‘PDA’’ నినాదంపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలిపి రాజకీయంగా సమీకరించేందుకు ఎస్పీ PDA (పిచ్డే, దళిత్, అల్పసంఖ్యక్) అనే నినాదాన్ని ఉపయోగిస్తోంది. దీని గురించి ఓవైసీ ప్రస్తావిస్తూ.. పీడీఏ అంటే ‘‘ పలట్ దియా అఖిలేష్’’ అని అన్నారు.
2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను ఓవైసీ ప్రస్తావించారు. అప్పట్లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలివేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎస్పీకి 47 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారు ముస్లిం కోసం ఏం చేయలేదని ఆరోపించారు.

