Site icon NTV Telugu

Tihar Jail: 90 మంది తీహార్ జైలు అధికారులు ట్రాన్స్‌ఫర్.. గ్యాంగ్‌స్టర్ హత్య తరువాత కీలక పరిణామం

Tihar Jail

Tihar Jail

Tihar Jail: గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో హత్య చేసిన కొన్ని రోజులకు కీలక పరిణామం సంభవించింది. 90 మందికి పైగా తీహార్ జైలు అధికారులను గురువారం ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు సహా 99 మంది అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సంజయ్ బెనివాల్ ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read Also: Dotted Lands: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం

టిల్లూ తాజ్‌పురియా హత్యను అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీంతో జైలులో పనిచేస్తున్న కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మందిని బదిలీ చేశారు. విధుల్లో అలసత్వాన్ని సహించమనే సందేశాన్ని గట్టి సందేశాన్ని పంపాలనే ఉద్దేశ్యంతో అధికారులు బదిలీలు చేపట్టారు. అత్యంత భద్రత ఉండే తీహార్ జైలులో గత వారం గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్‌పురియాపై గోగి గ్యాంగ్ లోని నలుగురు సభ్యులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కత్తులతో పొడవడంతో అతను మరణించాడు. ఈ గొడవంతా భద్రతా సిబ్బంది ముందే జరిగింది. హత్యకు సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ కేసులో తాజాగా ఈ రోజు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇద్దరు ఖైదీలను అరెస్ట్ చేసింది. అతా ఉర్ రెహ్మాన్, చవన్నీ అనే ఇద్దర ుఖైదీలు హత్యకు సహకరించారని తేలడంతో వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం ఆరుగురు అరెస్ట్ అయ్యారు.

Exit mobile version