Site icon NTV Telugu

Gujarat Tragedy: మోర్బీ వంతెన దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్‌’.. ఒరేవా మేనేజర్‌ వాదనలు

Gujarat Tragedy

Gujarat Tragedy

Gujarat Tragedy: గుజరాత్‌లో మోర్బీ వంతెన దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్‌’ అని బ్రిడ్జికి మరమ్మతులు చేసిన ఒరేవా కంపెనీ మేనేజర్‌ కోర్టులో వాదించారు. ఈ విషయాన్ని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. వంతెన తీగలు తప్పుపట్టిపోయాయని, ప్రజల సందర్శనకు వంతెన సిద్ధంగా లేదని న్యాయవాది పేర్కొన్నారు. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఈ ప్రమాదానికి కారణం.. ‘యాక్ట్ ఆఫ్ గాడ్'(దేవుడు చేసిన చర్య) అని పేర్కొన్నారు. ఒరేవా కంపెనీ మేనేజర్‌ కోర్టులో వాదించిన అనంతరం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ హెచ్‌ఎస్ పాంచల్ మీడియాకు వెల్లడించారు.

ఒరేవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లలో ఒకరు ఈ ఘటనను యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అని అన్నారు. ఇదిలా ఉండగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగల వంతెన పూర్తిగా తుప్పుపట్టిపోయినట్లు దర్యాప్తులో తెలిసింది. ప్రజల సందర్శనార్థం తెరిచేందుకు అసలు వంతెన సిద్ధంగానే లేదని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ చెప్పారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు ఒరేవా మేనేజర్లు అని న్యాయవాది తెలిపారు. గుజరాత్‌లోని మోర్బీ నగరంలో పెను విషాదానికి కారణమైన తీగల వంతెన మరమ్మతులను అర్హత లేని కాంట్రాక్టర్లు చేపట్టినట్లు తెలిసింది. పనులు అసంపూర్తిగా చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా బ్రిడ్జిని తెరవడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆ పనిలో కనీస అర్హత లేదని తాజాగా ప్రాసిక్యూషన్‌ మోర్బీ కోర్టుకు తెలిపింది.

Comedian Ali: పదవి ఇచ్చిన వెంటనే సీఎం ను కూతురు పెళ్లికి ఆహ్వానించిన ఆలీ

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన పోయిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మచ్చూ నదిపై ఉన్న ఈ కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. వంతెనకు ఏడు నెలల పాటు మరమ్మత్తులు నిర్వహించారు. రిపేర్లు పూర్తై వంతెన తెరిచిన నాలుగోరోజే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ఈ ఘటనపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది.

Exit mobile version