NTV Telugu Site icon

INDIA bloc: పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం

Rahul Gandhi

Rahul Gandhi

INDIA bloc: పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయింది. ఈ సమావేశానికి కూటమిలోని పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ హాజరయ్యారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల అంశాలపై ఇండియా కూటమి చర్చించింది.

Read Also: Mpox: “ఎంపాక్స్ వైరస్” ముంచుకొచ్చే ప్రమాదం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది. డీఎంకే ఎంపీ టీ రవి మాట్లాడుతూ, నీట్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా నీట్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం నుంచి జరిగే చర్చలో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు.