Site icon NTV Telugu

Waqf bill: వక్ఫ్ బిల్లుపై ప్రతిపక్షాల సమావేశం.. మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం..

Waqf Bill

Waqf Bill

Waqf bill: బుధవారం పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రాబోతోంది. లోక్‌సభలో ముందుగా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. చర్చ తర్వాత రాజ్యసభకు పంపనున్నారు. అయితే, ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మూడు రోజుల పాటు సభకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశాయి.

Read Also: Devendra Fadnavis: “ఉద్ధవ్ మీరు మీ నాన్న వైపు ఉంటారా..?, రాహుల్ గాంధీ వైపా..?

ఇదిలా ఉంటే, రేపు వక్ఫ్ బిల్లు సభ ముందుకు వస్తు్న్న నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. తమ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ సహా కీలమైన కాంగ్రెస్ ఎంపీలు, శివసేన(యూబీటీ), సీపీఎం పార్టీలు హాజరయ్యాయి. వక్ఫ్ బిల్లు చర్చలో పాల్గొంటామని చెబుతూనే, దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది అన్నారు. సభలో పూర్తిస్థాయిలో బిల్లును వ్యతిరేకిస్తామని సీపీఎం ఎమ్మెల్యే జాన్ బ్రిట్టాస్ అన్నారు.

ఇండీ కూటమితో పాటు భావస్వారూప్య పార్టీలను వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని అభ్యర్థిస్తున్నామని, ఇది రాజ్యాంగాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఇప్పటికే అన్నాడీఎంకే తెలిపింది. జిజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్, కేసీఆర్ తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు.

Exit mobile version