Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
- కేవలం 22 నిమిషాల్లోనే పాక్‌పై దాడి చేసి వచ్చిన సుఖోయ్ ఫైటర్ జెట్లు..
- పాక్ స్పందించే లోపే భీకర దాడి చేసిన భారత యుద్ధ విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్‌కు భారత్ సైనిక పాటవాలు మరోసారి అర్థమయ్యాయి. గతేడాది మే 7న ఇండియన్ ఎయిర్ఫోస్(IAF) పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కేవలం 22 నిమిషాల్లోనే మిషన్ పూర్తి చేసుకుని వచ్చినట్లు ఒక ఐఏఎఫ్ పైలట్ వెల్లడించారు. సుఖోయ్-30MKI యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలపై దాడులు నిర్వహించి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు చెప్పారు.
భారత విమానాల దాడి, టార్గెట్లపై దాడి చేయడం, తిరుగు ప్రయాణం కోసం సుమారు 22 నిమిషాల కీలక సమయం లభించింది. ఈ వ్యవధిలో పాకిస్తాన్ వైమానిక దళం పూర్తిస్థాయిలో మోహరించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వైమానిక పోరాటంలో రెస్పాన్స్ టైమ్ చాలా కీలకం. శత్రు దేశాల విమానాలను రాడార్లు గుర్తించడం, హెచ్చరికలు జారీ చేయడం, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థల నుంచి ఆదేశాలు ఇవ్వడం, అడ్డుకునే విమానాలు వేంగంగా గాల్లోకి టేకాఫ్ కావడం వేగంగా జరగాలి. ఇందులో ఎక్కడైనా జాప్యం జరిగిన విమానాలు తమ దాడుల్ని పూర్తి చేసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
అయితే, పాకిస్తాన్ వేగంగా స్పందించకపోవడానికి రాడార్ కవరేజ్ పరిమితులు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలో ఆలస్యం కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఆకస్మిక దాడి ద్వారా పాకిస్తాన్ వ్యవస్థలకు అంతరాయం కలిగి ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. దాడికి ఉపయోగించిన సుఖోయ్-30MKI భారత వైమానిక దళంలోని ప్రధాన మల్టీరోల్ ఫైటర్ జెట్లలో ఒకటి. దీర్ఘశ్రేణి ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, రాడార్ వ్యవస్థలు, థ్రస్ట్ వెక్టరింగ్ వంటి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ సర్ఫేస్ టార్గెట్లపై దాడులు చేయడం దీని సామర్థ్యం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!