Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్

  • రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
  • OpenAI మరో సంచలనం
  • ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
Irctc

Irctc

ఓపెన్‌ఏఐ మరో సంచలనం సృష్టించింది. కేవలం ఒక్క ఆదేశంతో ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుకింగ్ చేసుకునే ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఇటీవల ఓపెన్‌ఏఐ తన కొత్త మోడల్ అయిన GPT-6 ఆస్ట్రాను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ద్వారా ప్రయోగం చేయగా ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుక్ అయ్యాయి.

సహజంగా ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇక పండుగల సమయంలో మరింత కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సులువుగా టికెట్లు బుక్ చేసుకునే వెసులబాటు వచ్చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ GPT-6 ఆస్ట్రాను పరీక్షించాడు. ఈ కొత్త మోడల్ ద్వారా రైలు టికెట్ బుకింగ్ ప్రక్రియను పరీక్షించాడు. ఆశ్చర్యంగా ఈ పరీక్ష విజయవంతంగా ముగించింది. ఈ పరిణామంతో ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ కొత్త మోడల్‌ను దాదాపు రెండు మూడు రోజుల పాటు పరీక్షించాడు. మొత్తానికి విజయం సాధించాడు. ఈ ప్రయోగంతో భవిష్యత్‌లో ఏఐ తనంతట తానుగా పనులు పూర్తి చేసే దిశగా వెళ్తున్నట్లుగా ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతోంది. ఐఆర్‌సీటీసీలో ముంబై-రాజ్‌కోట్ రైలు టిక్కెట్‌ను ఏఐ (AI) సాయంతో బుక్ చేసినట్లుగా పేర్కొన్నాడు. ఈ ఫలితం చూసి తాను ‘‘ఆశ్చర్యపోయానని’’ చెప్పాడు.

https://x.com/IndiaLiveIN/status/2099678516484940261?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099678516484940261%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=