Site icon NTV Telugu

Viral Video: తేజస్ యుద్ధవిమానం క్రాష్.. బయటపడిన పైలెట్ వీడియోలు వైరల్..

Tejas

Tejas

Viral Video: 23 ఏళ్ల చరిత్రలో స్వదేశీ టెక్నాలజీ కలిగిన తేజస్ యుద్ధవిమానం తొలిసారిగా ఈ రోజు కూలిపోయింది. రాజస్థాన్ జైసల్మేర్ హాస్టర్ కాంప్లెక్స్ సమీపంంలో ఈ యుద్ధవిమానం కుప్పకూలింది. పైలెట్ పారాశూట్ సహాయంతో సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రస్తుతం ప్రమాదానికి గురవుతున్న పైలెట్ ఎజెక్ట్ చేస్తూ, బయటపడిన వీడియో వైరల్ అవుతోంది.

Read Also: Mission divyastra: క్షిపణి సక్సెస్ వెనుక హైదరాబాద్ సైంటిస్ట్.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

తేజస్ విమానం నేల వైపు దూసుకువస్తుండటం, అదే సమయంలో పైలెట్ విమానంలోని ఎజెక్ట్ బటన్ నొక్కి, కూలిపోతున్న విమానం నుంచి పారాశూట్ సాయంతో బయటపడటం వైరల్ వీడియోలో చూడవచ్చు. ప్రమాద సమయాల్లో యుద్ధవిమానాల్లోని పైలెట్లు విజయవంతంగా బయటపడేందుకు ఎజెక్షన్ సదుపాయం ఉంటుంది. పైలెట్ సీట్ కింద ఉన్న రాకెట్లు మండటం ప్రారంభించి, వెంటనే పైలెట్‌ని విమానం నుంచి వేరు చేస్తుంది. ఆ తర్వాత పారాశూట్ సాయంతో పైలెట్ సురక్షితంగా కిందకు దిగొచ్చు. ఎజెక్షన్ సమయంలో భూమి గురుత్వాకర్షణ శక్తితో పోలిస్తే 20 రెట్లు అధికమైన g-ఫోర్స్‌ని అనుభవిస్తాడు. తేజస్ బ్రిటిష్-తయారీ చేసిన, మార్టిన్ బేకర్, జీరో-జీరో ఎజెక్షన్ సీట్లను ఉపయోగిస్తుంది.

Exit mobile version