Site icon NTV Telugu

ఆ పరిస్థితి వస్తే రోజుకు 14లక్షల కేసులు చూడాలి: కేంద్రం

ఒమిక్రాన్‌ వేరింయంట్‌తో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఐరోపాదేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఒక విషయాన్ని ఉటంకిస్తూ రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించింది.బ్రిటన్‌లాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తితే మన జనాభా ప్రకారం రోజుకు 14లక్షల ఒమిక్రాన్‌ కేసుల నమోదు అవుతాయని కేంద్రం పేర్కొంది.

Read Also: బెయిల్‌ మంజూరుకు కారణాలు అవసరం లేదు

బ్రిటన్‌లోని కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నా వారిలోనూ పెద్ద సంఖ్యలో కరోనా డెల్డా, ఒమిక్రాన్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని పేర్కొంది. ఆఫ్రికాతోపాటు యూరప్‌ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. అలాంటి పరిస్థితులు దేశంలో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం వివరించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధలను పాటించాలని కేంద్రం కోరింది.

Exit mobile version