Omar-Nidhi Wedding: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్ వివాహంపై మతపరమైన వివాదం తెరపైకి వచ్చింది. వీరిద్దరి వివాహం ఇస్లామిక్ సూత్రాల ప్రకారం చెల్లదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యానించారు. షరియా ప్రకారం వివాహం చెల్లుబాటు కావాలంటే వధూవరులు ఇద్దరు ముస్లింలై ఉండాలని అన్నారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం అని, నిధి రజ్దాన్ ముస్లిం కాదని ఆయన అన్నారు. ఈ కారణంగా ఇది ఇస్లామిక్ సూత్రాల ప్రకారం అనుమతించలేమని అన్నారు.
నిధి రజ్దాన్‌ను పెళ్లికి ముందు ఇస్లాంలోకి మారేలా ఒమర్ అబ్దుల్లా చర్యలు తీసుకోవాల్సిందని, నిధి రజ్దాన్ ఇస్లాంలోకి మారి, ఆ తర్వాత ఇస్లామిక్ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఇద్దరూ నికాహ్ చేసుకుని ఉంటే ఆ వివాహాన్ని షరియత్ ప్రకారం అనుమతించవచ్చని రజ్వీ అన్నారు. ఇస్లాంలో నిర్దిష్టమైన నియమాలు, షరతులు ఉన్నాయని వివరించారు. దంపతుల్లో ఒక్కరు ముస్లిం కాకపోయినా ఆ వివాహాన్ని చెల్లుబాటుగా పరిగణించలేమని చెప్పారు. ఒమర్-నిధి వివాహం ‘నాజాయిజ్(అనుమతించనిది)’’గా అభివర్ణించారు.

