Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- ఒమన్ తీరంలో మునిగిన భారతీయ నౌక..
- నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ship sink: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓడ ఇంజన్ వైఫల్యంతో మునిపోవడం ప్రారంభమైంది. సకాలంలో రెస్క్యూ చేయడంతో అందులో ఉన్న 14 మంది భారతీయుల్ని సురక్షితంగా కాపాడారు. అయితే, ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మరణించారు. జూన్ 14న MSV విరాట్-1 అనే కార్గో షిప్ మునిగిపోయినట్లు మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదం ఒమన్ లోని రాస్ అల్ హద్‌కు సుమారు 80 నాటికన్ మైళ్ల దూరంలో జరిగింది.
ముందుగా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఇండియన్ నేవీకి చెందిన నౌకలు సంఘటనా స్థలానికి వెళ్లాయి. అయితే, అమెరికన్ నేవీకి చెందిన పీ-8 సముద్ర నిఘా విమానం సంఘటన స్థలానికి చేరుకుని ఒక లైఫ్ రాఫ్ట్ జారవిడిచి, భారతీయ సిబ్బందిని రక్షించింది. ఓడలోని 14 మంది సిబ్బంది లైఫ్ రాఫ్ట్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఎంవి జబల్ అలీ 9 నౌక కూడా సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉంటే మరో నౌకలో భారతీయ పౌరుడు నిశాంత్ ఉర్తానంతన్ మరణించారు. ఆరోగ్య కారణాల వల్ల మరణించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అతడి మృతదేహం దుక్మ్ పోర్టులోని ఎంటీ సెలెస్టియన్ నౌకలో ఉంది. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.
Also Read
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
The Mission has learnt of an incident involving an Indian Flagged Mechanised Sailing Vessel Virat 1, off the coast of Oman, reportedly embarked with 14 Indian crew. Search and Rescue is being coordinated with the Omani authorities and vessels in vicinity of the incident.
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) June 14, 2026
తాజావార్తలు
-
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
-
IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
-
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
-
YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!