Supreme Court: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగలేదు. ఏకంగా 288 మంది ప్రయాణికులు మరణించడంతో పాటు 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వేలోని ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిగితే తప్పా కారణాలు తెలియరావు.
Read Also: Cleaver Thief : సినిమా స్టైల్‌లో చోరీ.. రైలు బాత్రూం నుంచి తెలివిగా పరార్
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. రైలు ప్రమాదంపై విచారణకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో రైల్వే వ్యవస్థలో ప్రమాదాలు, భద్రతా పారామితులను విశ్లేషించడానికి, సమీక్షించడానికి, సూచించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మరియు సాంకేతిక సభ్యులతో కూడిన నిపుణుల కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్ రెండు నెలల్లో తన విచారణను ముగించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి, దాని నివేదికను సుప్రీంకోర్టు ముందు సమర్పించాలని పిటిషన్‌లో పేర్కొంది. కవాచ్ వ్యవస్థను త్వరగా అమలు చేయకపోవడం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం మరియు ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిల్ లో ఆరోపించారు. భారతీయ రైల్వేలలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్ కవాచ్ అమలుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా కోరింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును పరిరక్షించేందుకు, రైల్వేలో చర్యలను పరిష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారలిన తివారీ పిటిషన్ లో పేర్కొన్నారు.