Odisha: ఒడిశాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణపతి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ప్యూన్ తాగునీటికి బదులుగా ‘‘మూత్రం బాటిల్’’ ఇచ్చాడు. అది తాగిన సదరు అధికారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ కేసులో ప్యూన్‌ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ నీటి సరఫారా, పారిశుధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు నిందితుడైన ఫ్యూన్ సిబా నారాయణ్ నాయక్ మూత్ర బాటిల్ ఇవ్వడం సంచలనంగా మారింది.
Read Also: India On US Tarrifs: మా ఇంధనం మా ఇష్టం, రష్యా మా ‘‘ఆల్ వెదర్-ఫ్రెండ్’’: భారత్..
సచిన్ గౌడ అధికారికి ఫిర్యాదు మేరకు నారాయణ్ నాయక్‌ను ఆర్ ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 23న ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు ప్రకారం, సచిన్ గౌడ, నాయక్‌ను మంచి నీరు అడిగారు. అయితే, నీటికి బదులుగా అతను మూత్రం ఉన్న బాటిల్ ఇచ్చాడు. రాత్రి సమయం కావడం, తక్కువ వెలుగు ఉండటంతో సచిన్ గౌడ ఈ దానిని తాగాడు.
కొద్దిసేపటికే అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత చికిత్స కోసం బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. బాటిల్‌లోని ఉన్న ద్రవాన్ని పరీక్షల కోసం పంపాడు, దీనిలో అమ్మోనియా సాంద్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉందని, ఇది తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుందని వెల్లడైంది. తనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది కూడా ఇదే నీటిని తాగారని, దాని రుచి, నాణ్యత గురించి ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేశారని గౌడ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ చర్య వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
