Site icon NTV Telugu

UPI Transaction Limits: యూపీఐ లావాదేవీలపై పరిమితులను సవరించిన NPCI

Upi

Upi

UPI Transaction Limits: యూపీఐ లావాదేవీ పరిమితులను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) మరోసారి సవరించింది. బీమా ప్రీమియం, స్టాక్‌ మార్కెట్లు, క్రెడిట్‌ కార్డు బిల్లుల లాంటి విభాగాలకు యూపీఐ ద్వారా చెల్లించే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 15వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొనింది. ఇక, ఈ తేదీ నుంచి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితిని సైతం వేర్వేరు విభాగాల్లో రూ.10 లక్షల వరకు పెంచేసింది. ఎన్‌పీసీఐ ప్రకటనతో.. సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్, ప్రయాణ, వ్యాపార/మార్చంట్‌ సంబంధిత లావాదేవీలకు మాత్రం రూ.5 లక్షల పరిమితి వర్తించనుంది.

Read Also: Tollywood : మిరాయ్.. కిష్కింధపురి.. ప్రీమియర్స్ పై భయపడుతున్నారా?

అయితే, ఈ కొత్త పరిమితులు ఎవరికంటే: వెరిఫైడ్‌ మార్చంట్లుగా వర్గీకరించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని ఎన్‌పీసీఐ తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తి(పీ2పీ) చేసే లావాదేవీల పరిమితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేయలేదని పేర్కొనింది. సాధారణ యూపీఐ లావాదేవీలకు పరిమితి ఒక రోజుకు కేవలం లక్ష రూపాయలుగానే ఉంది.

Exit mobile version