Hema Malini: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో, మౌని అవామాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో సంగమం ప్రదేశంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో పాటు ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే విచారణ జరుగుతోంది.
Read Also: GHMC: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ..
ఇదిలా ఉంటే, ఈ తొక్కిసలాట ఘటనపై నటి-రాజకీయ నాయకురాలు హేమా మాలిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ‘‘ఇది చాలా పెద్ద సంఘటన కాదు. అది ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ దానిని ఎక్కువ చేసి చెబుతున్నారు’’ అని అన్నారు. యూపీ సీఎం యోగి ప్రభుత్వం చాలా చక్కగా ఏర్పాటు చేశారని ప్రశంసించారు. చాలా మంది వస్తుండటంలో, తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అంతకుముందు మహా కుంభమేళాలో సంగమంలో హేమామాలిని స్నానమాచరించారు. పవిత్ర స్నానం ఆచరించడం అదృష్టం అని చెప్పారు.