PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- విదేశీ ప్రయాణాలపై పన్ను అంటూ నివేదికలు
- ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు
- అందులో రవ్వంత కూడా నిజం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందనే మీడియా నివేదికలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. అందులో రవ్వంత కూడా నిజం లేదు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో ప్రధాని మోడీ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “ఇది పూర్తిగా తప్పు. ఇందులో ఒక్క ఇంచు సత్యం కూడా లేదు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు విధించే ప్రశ్నే లేదు. మా ప్రజల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము అని ఎక్స్ పోస్ట్ లో మోడీ తెలిపారు.
CNBC-TV18 సహా కొన్ని మీడియా సంస్థలు ఇటీవలి నివేదికల్లో, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమస్యల కారణంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, దిగుమతి ఖర్చులను భరించడానికి విదేశీ ప్రయాణాలపై తాత్కాలికంగా సెస్ లేదా సర్ఛార్జ్ విధించాలని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తోందని పేర్కొన్నాయి. ఈ నివేదికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నివేదికలకు ప్రధాని మోడీ స్వయంగా స్పందించడం అరుదైన విషయం.
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
మోడీ ఇచ్చిన క్లారిటీతో ఆ నివేదికలు తప్పుడవని నిరూపితమయ్యాయి. కొంతమంది మీడియా సంస్థలు తమ నివేదికను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వం ప్రజల సౌకర్యానికి, వ్యాపారాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం పీఎం మోడీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ సంఘటన ప్రజల మధ్య భయాలు, అపోహలను తొలగించింది. విదేశీ ప్రయాణాలు, టూరిజం, వ్యాపార ప్రయాణాలపై ఎలాంటి కొత్త పన్ను విధించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
This is totally false.
Not an iota of truth in this.
There is no question of putting such restrictions on foreign travel.
We remain committed to improving ‘Ease of Doing Business’ and ‘Ease of Living’ for our people. https://t.co/9lxjbxz0nV
— Narendra Modi (@narendramodi) May 15, 2026
తాజావార్తలు
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!