NTV Telugu Site icon

Maharashtra Polls: ముగిసిన నామినేషన్ల గడువు.. 15 సీట్లపై రెండు కూటమిల్లో గందరగోళం

Maharashtrapolls

Maharashtrapolls

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అంకం ముగిసింది. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అయితే రెండు కూటమిల మధ్య 15 సీట్లపై గందరగోళం నెలకొంది. ఆ స్థానాల్లో అధికారికంగా అభ్యర్థులను వెల్లడించలేదు. బీజేపీ, శివసేన( ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్‌ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదే విధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్‌ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం విశేషం.

ఇది కూడా చదవండి: IND W vs NZ W: శతకొట్టిన స్మృతి మంధాన.. ఇండియా విజయం

బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) 52 మంది అభ్యర్థులు, శివసేన( ఏక్‌నాథ్‌ షిండే వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో అధికార కూటమి చిన్న మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్‌ వర్గం), ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఎన్సీపీ( ఎస్పీ)కి సంబంధించినంత వరకు చివరి 87వ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసినట్లు తెలిపింది. అయినా కూడా 11 సీట్లపై అనిశ్చిత్తి నెలకొంది. ఈ సీట్లు​ కొన్ని చిన్న మిత్రపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయని అంచనా వేయగా.. ఎవరికి ఏది, ఎన్ని అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్‌న్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నవాబ్ మాలిక్ మాత్రం మంఖుడ్ స్థానం నుంచి రెండు నామినేషన్లను దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిలు పోటీపోటీగా తలపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Chhattisgarh: పెరోల్‌పై విడుదలైన రేపిస్ట్.. సొంత కూతురు, కొడలిపై అత్యాచారం..

Show comments