UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
- పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఉగ్రవాదులు
- భారీగా ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ.. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా పాకిస్థాన్ గ్యాంగ్స్టర్లు, ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఏటీఎస్ నిఘా పెట్టింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా భారత యువతను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న బాఘ్‌పత్‌కు చెందిన తుషార్ చౌహాన్ అలియాస్ హిజ్బుల్లా అలీ ఖాన్(20), ఢిల్లీకి చెందిన సమీర్ ఖాన్(20)ను అరెస్ట్ చేశారు. పాకిస్థానీ గ్యాంగ్స్టర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకుని, ఒక పెద్ద ఉగ్రవాద దాడికి పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపెట్టారు.
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
నిందితులపై బీఎన్ఎస్, ఆయుధాల చట్టం, యూఏపీఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపి కోర్టులో హాజరుపరిచారు. వారి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల గురించి సమాచారం సేకరించేందుకు పోలీస్ కస్టడీ రిమాండ్ కోరేందుకు కూడా ఏటీఎస్ సిద్ధమైంది. ఈ చర్యతో ఒక ప్రధాన ఉగ్రవాద కుట్ర భగ్నం చేయబడిందని, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఏటీఎస్ పేర్కొంది.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
-
Shubman Gill: గుర్బాజ్ గుబులు పెట్టాడు.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు!
-
Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
-
OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!