Site icon NTV Telugu

Noida: సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు

Untitled Design (1)

Untitled Design (1)

దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు.

పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. చుప్ మ్యాప్ ఐసీ దికారై అంటూ.. వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తన దగ్గర 13 కార్లు ఉన్నాయన్నాడు.
భయపడిన మహిళలు కారు ఆపాలని కోరారు.

డ్రైవర్ బ్రిజేష్‌ వెళ్తున్న వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. మరో దారిలో వెళ్లాలని సూచించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజేష్.. ‘చుప్.. మ్యాప్ ఇలాగే చేపిస్తుంది.. నా దగ్గర పదమూడు కార్లు ఉన్నాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బిజ్రేష్ .. సాలీ.. నీలాంటోళ్లు నా దగ్గర పది మంది పనిచేస్తారు అంటూ.. రాడ్డుతో వారిపై దాడికి తెగబడ్డాడు. బయట పడ్డ యువతులు అతడిపై కంప్లైంట్ ఇవ్వడంతో.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.. ఉబెర్ ఫ్లాట్ ఫామ్ నుంచి అతడిని తొలగించారు.

Exit mobile version