Site icon NTV Telugu

Omar Abdullah: ప్రజలను లాఠీలతో బెదిరించొద్దు.. సీఎంగా తొలి ఆదేశం

No Stick Waving

No Stick Waving

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పోలీసులకు తొలి ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల పర్యటన సమయంలో రోడ్లపై ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, లాఠీలు చూపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయరాదని ఆదేశించారు. తన రాకపోకల కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘జమ్మూకశ్మీర్ డీజీపీతో ఫోనులో మాట్లాడాను. వీఐపీల రాకపోకల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలకరాదని చెప్పాను. లాఠీలు ఝళిపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయవద్దని ఆదేశాలిచ్చాను. మన ప్రవర్తన పీపీల్స్-ఫ్రెండ్రీగా ఉండాలని నా మంత్రివర్గ సహచరులకు కూడా సూచించాను. ప్రజాసేవ కోసమే పదవుల్లో ఉన్నాం, వారికి అసౌకర్యం కలిగించడానికి కాదని చెప్పాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: IASs : తెలంగాణలో ఆరుగురు ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌లు రిలీవ్‌… వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు

బుధవారం జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక కూటమిలో భాగమైన కాంగ్రెస్ మాత్రం.. కేబినెట్‌లో పదవి తీసుకోలేదు. బయట నుంచి సపోర్టు ఇస్తామని తెలిపింది. ఇక ఈ ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఇక సురీందర్ చౌదరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.

 

Exit mobile version