Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌లో ఎలాంటి రేడియేషన్ లీక్ లేదు: IAEA

Pakistan

Pakistan

Pakistan: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఘన విజయం సాధించింది. టెర్రర్ క్యాంపులతో పాటు, భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పాకిస్తాన్‌కి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అయితే, ఈ ఆపరేషన్‌లో భారత్ పాకిస్తాన్ అణుస్థావరాలపై కూడా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో, ఆ ప్రాంతం నుంచి రేడియేషన్ లీకు అవుతుందనే వార్త సంచలనంగా మారింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని సర్గోదా ఎయిర్ బేస్‌కి సమీపంలో ఉన్న కిరాణా హిల్స్‌పై భారత్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనల్ని ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఖండించారు. భారత్ అక్కడ దాడి చేయలేదని చెప్పారు.

Read Also: Portronics Toad Ergo 3: ఇదేంటి భయ్యా ఇలా ఉంది.. కొత్త వర్టికల్ వైర్లెస్ మౌస్ లాంచ్ చేసిన పోర్ట్రోనిక్స్..!

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ లోని ఏ అణు కేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ జరగలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(IAEA) ప్రకటించింది. ఇటీవల, భారత త్రివిధ దళాల సైనికాధికాల సమావేశంలో కూడా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. తాము కిరాణా హిల్స్‌పై దాడి చేయాలేదని స్పష్టం చేశారు. మరోవైపు, రెండు దేశాల మధ్య అణు సంఘర్షణను నివారించామనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా తోసిపుచ్చారు.

Exit mobile version