Site icon NTV Telugu

Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…

Lalu Yadav

Lalu Yadav

Lalu Prasad: కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని, ఇతర రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడుతున్నారు. ఇది కేవలం పదవిని కాపాడుకునే బడ్జెట్ మాత్రమే అని, ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: CO2 Rising: పెరుగుతున్న ప్రాణాంతక కార్బన్ డయాక్సైడ్ వాయువు..నాసా ఏం చెప్తోంది..?

తాజాగా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కి గణనీయమైన నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేవలం రాష్ట్రానికి జుంజునా(బొమ్మ) మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వడంపై బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా రాకుండా బీహార్ అభివృద్ధి జరగదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వం పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

Exit mobile version