Site icon NTV Telugu

Nitish Cabinet : నితీష్ కేబినెట్‌లో శాఖల విభజన.. మంత్రుల పూర్తి జాబితా ఇదే

Nitish Kumar

Nitish Kumar

Nitish Cabinet : బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే మంత్రి మండలిలోని 30 మంది మంత్రులకు మంత్రిత్వ శాఖలను విభజించారు. జేడీయూకు చెందిన సునీల్ కుమార్ కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఇప్పుడు ఆర్థిక మరియు వాణిజ్య పన్నుల శాఖను కలిగి ఉన్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు రెండో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు మైనింగ్, ఆర్ట్, కల్చర్, యూత్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఎస్సీ/ఎస్టీ శాఖ కాకుండా మరేదైనా కావాలని అడుగుతున్న సంతోష్ సుమన్ మాంఝీకి ఐటీతో పాటు మైనర్ వాటర్ రిసోర్సెస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కూడా దక్కింది. మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇంధన శాఖ బాధ్యతలను కొనసాగిస్తారు. ఆయనకు ప్రణాళిక, అభివృద్ధి శాఖ కూడా ఉంటుంది. సహకార మంత్రితో పాటు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖను కూడా ప్రేమ్ కుమార్ చూసుకుంటారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రవణ్ కుమార్ కొనసాగనున్నారు.

Nitish_Government_Ministry_List_1710575761

New Project (41)

Exit mobile version