Site icon NTV Telugu

Ratan Tata: రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ.. ఉద్యోగులు ఘన నివాళి

Tataratan

Tataratan

రతన్ టాటా భారతదేశ ముద్దు బిడ్డ అని నీతా అంబానీ కొనియాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, వారి కుటుంబ సభ్యులు, రిలయన్స్ నాయకత్వం, వేలాది మంది ఉద్యోగులు రతన్ టాటాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడారు. రతన్ టాటా ‘‘గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా’’ అని పిలిచారు. దూరదృష్టి గల పారిశ్రామికవేత్త, పరోపకారి అని పేర్కొన్నారు. రతన్ టాటా ఎల్లప్పుడూ సమాజం కోసం ఆలోచించేవారని.. ఎంతో సేవలు కూడా చేశారని ప్రశంసించారు.

రతన్ టాటా (86) ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణంతో భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. దేశానికి ఆయన సేవలను సినీ, రాజకీయ ప్రముఖులు జ్ఞాపకం చేసుకున్నారు. ఇక అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వం తరుపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రతన్ టాటాకు వచ్చిన ఆదాయంలో సగం ప్రజా సేవకే ఖర్చు చేసేవారు. ఇక ఆయన ఎవరితోనూ పోటీ పడే వారు కాదు. దేశానికి సేవలందించాలన్న ఉద్దేశంతోనే పరిశ్రమలు కొనసాగించారు. అందుకే ఆయన అందరి మన్ననలు పొందారు.

 

Exit mobile version