ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఢిల్లీలో కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఇవాళ ఢిల్లీలో 290 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 16శాతం పెరిగింది. మరోవైపు పాజిటివిటీ రేటు ఐదు శాతానికి మించడంతో… ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో ఢిల్లీలో న్యూఇయర్ వేడుకలకు ఫుల్‌స్టాప్ పడింది.
