NTV Telugu Site icon

Mumbai Attack: ముంబైపై 40 డ్రోన్లతో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన ఎన్ఐఏ.. కీలక ఉగ్రవాది అరెస్ట్..

Nia

Nia

Mumbai Attack: దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఏకంగా 40 డోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌గా నిందితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్‌ని అరెస్ట్ చేశారు.

Read Also: Parliament: మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్.. 146కి చేరిన సంఖ్య..

ఉగ్రవాది సాకిబ్ నాన్ ఐఎస్ ఖలీఫాకు విధేయత ప్రకటించుకున్నాడు. అతని కుమారుడు షామిల్‌కి కూడా పేలుడు పదార్థాల తయారీ, శిక్షణ, పరీక్షల్లో ప్రయేయం ఉన్నట్లు తేలింది. అతడిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ నిర్వహించిన దాడుల్లో భారీగా ఆయుధాలు, 51 హమాస్ జెండాలు, 68 లక్షల నగదు, 38 మొబైల్స్, 3 హార్డ్ డిస్కులు పట్టుబడ్డాయి. నాచన్ తో పాటు అతని బంధువులు రజిల్ అబ్దుల్ లతీఫ్, రఫిల్ నాచన్‌లను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

ముంబైకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా గ్రామం పేరును అల్-షామ్‌గా మార్చారు. దీని అర్థం ‘‘గ్రేట్ సిరియా’’. నిందితులు ఈ గ్రామాన్ని స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకోవడమే కాకుండా.. అక్కడ ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Show comments