కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. గతంలో ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసింది .. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది .. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. NHPC లో ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానం కోరుతున్నారు.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు 55 శాతం మార్కుల తో ఉత్తీర్ణత పొందాలి..దరఖాస్తుదారుల వయసు జూన్ 30, 2023వ తేదీనాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి..ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి..
ఖాళీల వివరాలు..
జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 149
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 74
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 63
జూనియర్ ఇంజినీర్ (ఇ&సి) పోస్టులు: 10
సూపర్‌వైజర్ (ఐటీ) పోస్టులు: 9
సూపర్‌వైజర్ (సర్వే) పోస్టులు: 19
సీనియర్ అకౌంటెంట్ పోస్టులు: 28
హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 14
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) పోస్టులు: 14
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) పోస్టులు: 8
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకోవాలి అనుకొనేవారు రూ .295 లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. హిందీ/ఇంగ్లిష్ భాషలో రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 200 మార్కులకు 3 గంటల సమయంvలో పరీక్ష రాయవల్సి ఉంటుంది… ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ. 29,600 నుంచి రూ. 1,19,500, హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.27,000 నుంచి రూ.1,05,000, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ. 25,000 నుంచి రూ. 85,000 వరకు జీతం ఉంటుంది.. ఈ జాబ్స్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి..