దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెకండ్ వేవ్ సమయంలో భారీగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా, మరణాలు మూడు వేలకు పైగా నమోదయ్యాయి. కాస్త తెరిపించడంతో అన్ని రంగాలను తిరిగి ప్రారంభించారు. పర్యాటక రంగం తిరిగి ప్రారంభం కావడంతో హిమాచల్ ప్రదేశ్ వంటి హిల్ స్టేషన్ రాష్ట్రాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. మాస్క్‌ను పక్కన పెట్టి తిరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 13 వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే తప్పని సరిగా నెగెటివ్ సర్టిఫికెట్ లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, అప్పుడే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నది. పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నాక హిమాచల్ ప్రదేశ్‌కు టూరిస్టుల తాకిడి భారీగా పెరిగింది.
ఆగస్టు 13 నుంచి కొత్త రూల్స్… అక్కడికి వెళ్లాలంటే…
