NTV Telugu Site icon

పిల్ల‌ల కోసం న‌యామాస్క్ః ఖ‌రీదు ఎక్కువే కానీ…

క‌రోనా సెకండ్ వేవ్ నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క ముందే థ‌ర్డ్ వేవ్ భ‌యం ప‌ట్టుకుంది.  మొద‌టి వేవ్ కంటే సెకండ్‌వేవ్‌లో ఎక్క‌వ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువ‌గా యువ‌త‌పై ఉన్న‌ది.  అయితే, థ‌ర్డ్ వేవ్ పొంచి ఉన్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. అయితే థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం ముఖ్యంగా చిన్నారుల‌పై ఉన్న‌ట్టుగా నిపుణులు ఇప్ప‌టికే చెబుతున్నారు.  చిన్నారుల కోసం వ్యాక్సిన్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. అదేవిధంగా, చిన్నారుల కోసం సెంట్ర‌ల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ పార‌దర్శ‌కంగా ఉండే మాస్క్ ల‌ను త‌యారు చేసింది.  పార‌ద‌ర్శ‌కంగా ఈ మాస్క్ ల వ‌ల‌న ఎవ‌రికి ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని, చిన్నారులు శ్వాస తీసుకోవ‌డానికి వీలుగా ఉంటుంద‌ని సీఎస్ఐవో తెలియ‌జేసంది.  ఇప్ప‌టికే వీటిని చిన్నారుల‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు.  జూన్ నెలాఖ‌రులోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.  వీటి ధ‌ర రూ.200 నుంచి రూ.300 వ‌ర‌కు ఉంటుంద‌ని సీఎస్ఐవో తెలియ‌జేసింది.