ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. DNA పరీక్ష ద్వారా కారులోని మృతదేహం గుర్తింపు..
సోమవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట ప్రాంతంలోని ట్రాఫిక్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలోనే కారు భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. దీంతో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో ఏం జరిగిందో అర్థం కాక వాహనాలు విడిచి పెట్టి పరుగులు తీశారు. ఒక్కసారిగా అందరూ అయోమయానికి గురైనట్లుగా కనిపించింది. చాలా మంది భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో క్లియర్‌గా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: “ఢిల్లీ ఘటన సిలిండర్ పేలుడు మాత్రమే”.. పాక్ రక్షణ మంత్రి మాటల్లో భయం..
ఇక సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడులో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇక కారులో ఉన్నది ఎవరన్నది సందిగ్ధం వీడిపోయింది. కారు నడిపింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన అవశేషాలతో (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) సరిపోలాయి. DNA పరీక్షలో ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100 శాతం సరిపోయింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి. కారులో ఐఈడీ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్‌లో బాంబ్ తయారీలో ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోబోతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట సమీపంలో అనుమానితులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలో పొరపాటుగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కారులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ను అనుమానితుడు సరైన రీతిలో అమర్చకపోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా నిపుణులు అంచనాకు వచ్చారు.
#WATCH | Delhi 10/11 Blast: Latest CCTV footage captures the moment of blast#DelhiBlast pic.twitter.com/MjC9fzjqR1
— NDTV (@ndtv) November 12, 2025
