NTV Telugu Site icon

IC 814 – The Kandahar Hijack: ‘IC 814’ వెబ్ సిరీస్‌పై దుమారం.. నెటిఫ్లిక్స్ ఇండియా హెడ్‌కి కేంద్రం సమన్లు..

Ic 814 The Kandahar Hijack Story

Ic 814 The Kandahar Hijack Story

IC 814 – The Kandahar Hijack: 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించబడిన ‘IC 814: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌పై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో ఐదుగురు హైజాకర్ల పేర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు హిందూ పేర్లయిన భోలా, శంకర్ అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అని ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ వివాదాల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చీఫ్ మోనికా షెర్గిల్‌ను మంగళవారం, సెప్టెంబర్ 3న, వెబ్ సిరీస్‌లోని వివాదాస్పద అంశాల గురించి వివరణ ఇవ్వాల్సిందిగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసి 814ను పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ హైజాక్ చేసిన ఉదంతం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది. ఇందులో ఇద్దరు హైజాకర్లను హిందూ కోడ్‌నేమ్స్‌లో పిలవడం వివాదానికి కారణమైంది.

Read Also: Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??

సీరీస్‌లోని హైజాకర్లు చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ అనే కోడ్‌నేమ్‌లతో చిత్రీకరించబడ్డారు. దీంతో ఈ వెబ్ సిరీస్ మేకర్ అనుభవ్ సిన్హాను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హైజాకర్లు అందరూ ముస్లిం ఉగ్రవాదులని, హిందూ పేర్లను ఎలా హైలెట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

సిరీస్‌లోని హైజాకర్లు చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ అనే కోడ్‌నేమ్‌లతో చిత్రీకరించబడ్డారు. అయితే, భోలా మరియు శంకర్ పేర్లను ఉపయోగించడం పెద్ద వివాదానికి దారితీసింది, విమర్శకులు సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హాను లక్ష్యంగా చేసుకున్నారు. హైజాకర్లు ఐదుగురు ముస్లిం ఉగ్రవాదులని, వారిలో ఇద్దరు హిందూ మారుపేర్లను ఉపయోగించారనే విషయాన్ని షో హైలైట్ చేసి ఉండాల్సిందని వారు వాదిస్తున్నారు. జర్నలిస్ట్ సృంజయ్ చౌదరి మరియు హైజాక్ చేయబడిన ఫ్లైట్ కెప్టెన్ దేవి శరణ్ రాసిన ‘ఫ్లైట్ ఇన్‌టు ఫియర్: ది కెప్టెన్స్ స్టోరీ’ పుస్తకం నుండి ఈ సిరీస్ రూపొందించబడింది.

దీనిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ వెబ్ సిరీస్ హిందువుల్ని అవమానపరిచిందని, IC-814 యొక్క హైజాకర్లు భయంకరమైన ఉగ్రవాదులని, వారు తమ ముస్లిం గుర్తింపులను దాచడానికి మారుపేర్లను పెట్టారని ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. చిత్రనిర్మాత అనుభవ్ సిన్హా, వారి ముస్లిమేతర పేర్లను పెట్టడం ద్వారా వారి నేర ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారని అన్నారు. దశాబ్ధాల తర్వాత విమానాన్ని హైజాక్ చేసింది హిందువులే అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

Show comments