Madhuri Dixit Row: మాధురిపై అవమానకర కామెంట్.. చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix Gets Legal Notices Over Madhuri Dixit Row: సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రానురాను ఓటీటీ కంటెంట్ మాత్రం మరీ హద్దు మీరిపోతోంది. అడల్ట్ కంటెంట్ విషయంలోనే కాదు.. డైలాగుల్లోనూ బరితెగించేస్తున్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్యకరమైన డైలాగ్స్ పెట్టేస్తున్నారు. వీటిపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. ఓటీటీ కంటెంట్ క్రియేటర్స్ తీరు మాత్రం మారట్లేదు. ఎవరేం చేస్తారనే ధీమాతో.. మరింతగా రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ.. మాధురి దీక్షిత్ విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Ravi Teja vs Ram Pothineni: బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేనితో రవితేజ క్లాష్
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
అసలు విషయం ఏమిటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ద బిగ్ బ్యాంగ్ థియరీ సీజన్ 2లోని ఒక ఎపిసోడ్‌లో జిమ్ పార్సన్స్, కునాల్ నయ్యర్ మధ్య ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్‌లకు సంబంధించిన సంభాషణ నడుస్తుంది. జిమ్ పార్సన్స్ ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’గా పేర్కొంటాడు. అప్పుడు కునాల్ వెంటనే అందుకొని.. ‘కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై బాలీవుడ్ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మాధురి దీక్షిత్ లాంటి స్టార్ నటిని అవమానించేలా.. ఆ కామెంట్ ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ నటి, ఎంపీ, అమితాభ్ బచ్చన్ భార్య అని జయబచ్చన్ కూడా ఇప్పటికే ఈ విషయంపై విరుచుకుపడ్డారు. కునాల్‌కి ఏమైనా పిచ్చి పట్టిందా, అతడ్ని వెంటనే మానసిక ఆసుపత్రికి తరలించాలి, అతని వ్యాఖ్యల పట్ల కుటుంబ సభ్యుల్ని నిలదీయాలని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు మిథున్ కుమార్ ఈ సన్నివేశంపై మండిపడుతూ.. నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపారు.
Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా
‘‘సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా.. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫామ్స్‌లో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించి, ఆ తర్వాత ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉంది. అవమానకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్ చేయాలి. ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్‌లో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం నన్ను బాధించింది. ఆ పదాన్ని గణనీయమైన అభిమానుల్ని కలిగిన మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరమైంది. ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది’’ అంటూ మిథున్ కుమార్ తన ప్రకటనలో పేర్కొంటూ.. లీగల్ నోటీసులు పంపించారు.
- Tags
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?