NTV Telugu Site icon

Madhuri Dixit Row: మాధురిపై అవమానకర కామెంట్.. చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ

Madhuri Dixit Row

Madhuri Dixit Row

Netflix Gets Legal Notices Over Madhuri Dixit Row: సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రానురాను ఓటీటీ కంటెంట్ మాత్రం మరీ హద్దు మీరిపోతోంది. అడల్ట్ కంటెంట్ విషయంలోనే కాదు.. డైలాగుల్లోనూ బరితెగించేస్తున్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్యకరమైన డైలాగ్స్ పెట్టేస్తున్నారు. వీటిపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. ఓటీటీ కంటెంట్ క్రియేటర్స్ తీరు మాత్రం మారట్లేదు. ఎవరేం చేస్తారనే ధీమాతో.. మరింతగా రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ.. మాధురి దీక్షిత్ విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Ravi Teja vs Ram Pothineni: బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేని‌తో రవితేజ క్లాష్

అసలు విషయం ఏమిటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ద బిగ్ బ్యాంగ్ థియరీ సీజన్ 2లోని ఒక ఎపిసోడ్‌లో జిమ్ పార్సన్స్, కునాల్ నయ్యర్ మధ్య ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్‌లకు సంబంధించిన సంభాషణ నడుస్తుంది. జిమ్ పార్సన్స్ ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’గా పేర్కొంటాడు. అప్పుడు కునాల్ వెంటనే అందుకొని.. ‘కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై బాలీవుడ్ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మాధురి దీక్షిత్ లాంటి స్టార్ నటిని అవమానించేలా.. ఆ కామెంట్ ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ నటి, ఎంపీ, అమితాభ్ బచ్చన్ భార్య అని జయబచ్చన్ కూడా ఇప్పటికే ఈ విషయంపై విరుచుకుపడ్డారు. కునాల్‌కి ఏమైనా పిచ్చి పట్టిందా, అతడ్ని వెంటనే మానసిక ఆసుపత్రికి తరలించాలి, అతని వ్యాఖ్యల పట్ల కుటుంబ సభ్యుల్ని నిలదీయాలని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు మిథున్ కుమార్ ఈ సన్నివేశంపై మండిపడుతూ.. నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపారు.

Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా

‘‘సామాజిక‌, సాంస్కృతిక విలువ‌లను కించ‌ప‌ర‌చ‌కుండా.. ప్రజ‌ల మ‌నోభావాలు దెబ్బతిన‌కుండా చూసుకోవ‌డం నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫామ్స్‌లో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా ప‌రిశీలించి, ఆ తర్వాత ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉంది. అవమానకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్‌ చేయాలి. ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్‌లో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం నన్ను బాధించింది. ఆ పదాన్ని గణనీయమైన అభిమానుల్ని కలిగిన మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరమైంది. ఆమె ఆత్మ గౌరవాన్ని, ప‌రువును కించ‌ప‌రిచేలా ఉంది’’ అంటూ మిథున్ కుమార్ తన ప్రకటనలో పేర్కొంటూ.. లీగల్ నోటీసులు పంపించారు.

Show comments