NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
- రాజస్థాన్ నీట్ ఎగ్జామ్ సెంటర్ వద్ద వివాదం..
- బురఖా తీయడానికి ఒప్పుకోని విద్యార్థిని..
- పరీక్ష కన్నా తన గౌరవమే ముఖ్యమన్న కుల్సుమ్ బానో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Exam: రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది. కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. అయితే, మతపరమైన దుస్తులు ధరించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అనుమతిస్తుందని, అయినా తనను పరీక్షకు అనుమతించలేదని విద్యార్థిని మీడియాతో అన్నారు. మే 3న పరీక్ష రాసినప్పుడు ఎలా బురఖా, దుపట్టా ధరించి వెళ్లాలో, ఇప్పుడు కూడా నేను అలాగే పరీక్షకు హాజరయ్యానని, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేదని ఇప్పుడు మాత్రం నిరాకరించారని కుల్సుమ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఒక ముస్లింగా తన గుర్తింపు కోల్పోవడం కన్నా పరీక్ష వదులుకోవడానికే తాను సిద్ధంగా ఉన్నానని బానో చెప్పారు. ఒక వేళ నేను పరీక్ష రాయాల్సి ఉండి, ఈ దుస్తుల్లో తనను అనుమతించకపోతే, నేను అస్సలు పరీక్ష రాయనని, 18 ఏళ్ల వాళ్లతో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అని, నాకు పరీక్ష కన్నా బురఖానే ముఖ్యమని ఆమె చెప్పింది. అయితే, ఈ వివాదం తర్వాత విద్యార్థిని అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
విద్యార్థిని తండ్రి మహమ్మద్ అలీమ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఏ బురఖాను అనుమతించింది, నా కూతురు బురఖా లేకుండా పరీక్ష రాయదు, ఆమె మూడేళ్లుగా దీని కోసం సిద్ధమవుతోంది, నా మే 3వ తేదీన పరీక్ష రాసింది, అప్పుడు కూడా ఆమె బురఖా ధరించే ఉంది. నియమం 18 ప్రకారం, మీరు మీ మతపరమైన దుస్తులను ధరించి పరీక్షకు హాజరు కావచ్చు… ఒక మహిళా సిబ్బందిని పిలిచి, క్షుణ్ణంగా తనిఖీ చేయించి, ఒక తెర వెనుక ఏకాంత ప్రదేశంలో ఆమె బురఖాను తీయించమని మేము వారిని కోరాము, కానీ వారు నిరాకరించారు.’’ అని అన్నారు.
నియమాలు ఏం చెబుతున్నాయి.?
నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో మతపరమైన వివాదాలు ఎదురవ్వడం కొత్త కాదు. జాతీయ పరీక్షల సంస్థ (NTA) మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు మత సంప్రదాయాలకు అనుగుణంగా నిర్దిష్ట వస్త్రధారణ (బురఖా, హిజాబ్, కిర్పాన్ లేదా తలపాగా వంటివి) ధరించి పరీక్షలకు హాజరు కావొచ్చు. అయితే, అటువంటి విద్యార్థులు సాధారణంగా రిపోర్ట్ చేయాల్సిన సమయానికి సుమారు ఒకటి నుండి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, తద్వారా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చు. ఈ వివాదంలో పరీక్షా కేంద్రంలో సిబ్బందికి, విద్యార్థినికి మధ్య సమన్వయం లోపమే కారణమని తెలుస్తోంది.
#WATCH | Ajmer, Rajasthan: A Burqa-wearing candidate was allegedly denied entry at a medical entrance exam centre ahead of the NEET examination today.
A candidate, named Kulsum Bano, says, "I have come from Beawar to take the NEET exam. When I took the exam on May 3rd, I was in… pic.twitter.com/3TVNnYk52n
— ANI (@ANI) June 21, 2026
#WATCH | Ajmer, Rajasthan: Student's father, Mohammad Aalim says, "Since the NTA has established this rule, they must allow it; otherwise, my daughter will not go to take the exam without her burqa. She has been preparing for this for three years. My daughter took the exam on May… https://t.co/EwI7dPCeSm pic.twitter.com/F95DI8xzIi
— ANI (@ANI) June 21, 2026
తాజావార్తలు
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!